ఈ రెండు రంగాల్లో.. AI వల్ల ఉద్యోగాలు పోతాయా..

ఈ రెండు రంగాల్లో.. AI వల్ల ఉద్యోగాలు పోతాయా..

రాబోయే 18 నెలల్లో వ్యాపార రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన మార్పును చూపబోతోంది. ఏఐ ప్రవేశంతో  ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని ఇటీవల నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. 

బెయిన్  కంపెనీ 570 మంది ఎగ్జిక్యూటివ్‌ల సర్వే ఆధారంగా 75శాతం మంది ఆ రంగాల్లో AI  ప్రభావం ఉంటుందని  వ్యాపారంలో గణనీయమైన వృద్ధి, కస్టమర్ల ఆకర్షించడంలో ఏఐతో గణనీయమైన అవకాశాలున్నాయని సాఫ్ట్ వేర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఏఐ లో వచ్చే కొద్దిపాటి రిస్క్ లను పక్కనబెట్టి చాలా కంపెనీలు ఆయా రంగాల్లో ఏఐని తమ కంపెనీ కార్యకలాపాల్లో వినియోగించుకుంటున్నాయని బెయిన్ టెక్నాలజీ హెడ్ తెలిపారు.89 శాతం సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇప్పటికే ఏఐ అప్లికేషన్లను తమ కంపెనీ కార్యకలాపాల్లో వినియోగించి ఉత్పత్తిలో ఇతర కంపెనీల కంటే 15 శాతం అధికంగా ఉత్పాదకత సాధించినట్లు తెలిపారు. 

ఏఐ మెషిన్ లర్నింగ్ (ML) అనుభవం ఇంజనీరింగ్ విభాగంలో పెరుగుతుంది.. ప్రత్యేకించి కంపెనీ కార్యకలాపాల్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నిర్మించడంలో ఏఐ అవసరాన్ని తెలియజేస్తుందన్నారు. 
ఉత్పాదక AI కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను మార్కెటింగ్ చేయడం, విక్రయించే విధానంతో విప్లవాత్మకంగా మారుస్తుందని అంచనా  వేస్తున్నారు. డిమాండ్ , లీడ్ జనరేషన్, డిజిటల్ సెల్ఫ్ సర్వీస్ సేల్స్, కస్టమర్ సక్సెస్, సపోర్ట్ యాక్టివిటీలతో సహా కస్టమర్ లైఫ్ సైకిల్‌లోని వివిధ దశలను మోటివేట్ చేస్తుందని చెబుతున్నారు. 

2023 ప్రారంభంలో వెంచర్ వృద్ధిలో AI , ML పెట్టుబడులు ముందంజలో ఉన్నాయి. పెట్టుబడిదారులు AI పట్ల తీవ్ర ఆసక్తిని కనబరిచారు. అయితే AI రంగంలో పెరుగుతున్న పోటీతో పెట్టుబడి దారులు జాగ్రత్త పడుతున్నారు. 

దీనిని బట్టి AI అనుసంధానంతో ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ రంగంలో ప్రభావం చూపుతుందని.. ఏఐ అడాప్టర్లు ఇప్పటికే ఉత్పాదకత లాభాలను అందుకుంటున్నారని.. దీంతో ఏఐ తో కంపెనీల వృద్ది జరుగుతున్నందున.. ఆ రంగాల్లో ఉద్యోగలపై ప్రభావం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.