ఫైర్ సేఫ్టీ లేకుండా కాలేజీలు నడుపుతున్నరు: విద్యార్థి జేఏసీ

ఫైర్ సేఫ్టీ లేకుండా కాలేజీలు నడుపుతున్నరు: విద్యార్థి జేఏసీ

నారాయణ, చైతన్య విద్యాసంస్థలపై ఇంజనీరింగ్ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు 

హైదరాబాద్, వెలుగు:ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్( డీఐఈవో)కు ఫిర్యాదు చేశారు. శ్రీ చైతన్య కాలేజ్ వేద వ్యాస క్యాంపస్ , నారాయణ జూనియర్ కాలేజ్ బాసర శరణి క్యాంపస్​లో వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారని జేఏసీ  ప్రెసిడెంట్ శరణ్​కుమార్, కార్తీక్ గౌడ్ పేర్కొన్నారు.  మాదాపూర్ జోన్​లో 30 వరకు బ్రాంచ్​లు ఉన్నాయని, ఇందులో వేలాది మంది స్టూడెంట్లు చదువుతున్నారని తెలిపారు. ఇరుకు గదుల్లో క్లాస్​లు, హాస్టళ్లు నడుపుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే  స్టూడెంట్లు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఆయా క్యాంపస్​లకు నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని నేతలు డీఐఈవోను కోరారు.