లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫ్ : ఇంజనీర్లు

లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫ్ : ఇంజనీర్లు

గుజరాత్‌లోని మోర్బిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. దాదాపు 140 మందిని బలితీసుకున్న ఈ ఘోరం దేశంలోని మిగతా కేబుల్ బ్రిడ్జీల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. తెలంగాణలో కూడా పలుచోట్ల కేబుల్ బ్రిడ్జిలు ఉండగా.. అవి సేఫేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి సేఫ్ అని ఇంజనీర్లు స్పష్టం చేశారు. లక్నవరం బ్రిడ్జికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.    

బ్రిడ్జిపై ఒకేసారి 300 మంది ఉండొచ్చని తెలిపారు. 2008లో నిర్మించిన పాత బ్రిడ్జి 180 మీటర్లు ఉండగా..2018లో నిర్మించిన కొత్త బ్రిడ్జి 152 మీటర్లు ఉంది. ఈ నిర్మాణంలో ఐఎస్ఐ స్టాండర్డ్స్ కలిగిన స్టీల్ను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇవి తుప్పు పపట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పైలాన్ మధ్య రోప్లతో ఈ బ్రిడ్జి నిర్మించినట్లు చెప్పారు. పైలాన్ పైనా రోప్ కదిలే విధంగా వీల్స్ ఉంటాయన్నారు. దక్షిణ కొరియా నుంచి నిర్మాణ సామాగ్రిని తెప్పించినట్లు వివరించారు.

లక్నవరం చెరువు ప్రకృతి అందాలకు నెలవు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య సరస్సు ఉంటుంది. సరస్సు మధ్యలో వేలాడే వంతెనలు పెద్ద అట్రాక్షన్. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు. వీకెండ్స్ లో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది.