ODI World Cup 2023: లెక్క సరిపోయింది: ఇంగ్లాండ్ క్రికెట్‪ను ప్రమాదంలో పడేసిన టీమిండియా

ODI World Cup 2023: లెక్క సరిపోయింది: ఇంగ్లాండ్ క్రికెట్‪ను ప్రమాదంలో పడేసిన టీమిండియా

వరల్డ్ కప్ లో టీమిండియా ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీ కొట్టింది. తొలిసారి ఈ వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో విఫలమైన రోహిత్ సేన బౌలింగ్ లో మాత్రం విజ్రంభించింది. ఫాస్ట్ బౌలర్లతో పాటు, స్పిన్నర్లు లక్నో పిచ్ మీద పోటీపడి మరీ వికెట్లు తీయడంతో 100 పరుగులతో గెలిచిన టీమిండియా.. ఈ మెగా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అధికారికంగా ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ నిష్క్రమించింది. అయితే ఇంగ్లాండ్ ను భారత్ మరో రకంగా దెబ్బ కొట్టింది. 

షెడ్యూల్ ప్రకారం 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. టాప్-8 లో జట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్ 7లో నిలిచిన జట్లు, నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని తెలిపింది. పాకిస్థాన్ ఆతిధ్య జట్టు కాబట్టి మొత్తం 8 జట్లతో ఈ టోర్నీ జరుగుతుంది. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పరిస్థితి చూసుకుంటే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 

Also Read :- దుమ్మురేపుతున్న భారత్

ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరో మూడు మ్యాచులు ఇంగ్లాండ్ ఆడాల్సి ఉంది. ఈ మూడు గెలిస్తేనే ఇంగ్లాండ్ టాప్ 7 లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి ఓడిపోయిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఇంగ్లాండ్ కు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లీగ్ మ్యాచ్ లు ముగిసేసరికి ఏ స్థానంలో ఉంటుందో చూడాలి. మొత్తానికి 2019 వరల్డ్ కప్ లో పరాజయానికి ప్రతీకారం తీసుకున్న భారత్.. ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలకు దెబ్బ కొట్టింది.