
ఇంగ్లాండ్ టీం మరో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షల పరుగులు సాధించిన మొదటి జట్టుగా రికార్డులకెక్కింది. సౌతాఫ్రికాతో జరిగిన నాల్గవ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడంతో 5 లక్షల రన్స్ పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ 1022 వ టెస్టులో 5 లక్షల రన్స్ పూర్తి చేసుకోగా.. 830 టెస్టుల్లో 432,706 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. తర్వాత 540 టెస్టుల్లో 273,518 పరుగులతో భారత్ 3 వ స్థానంలో ఉంది. వెస్టిండీస్ 545 టెస్టుల్లో 270,441 పరుగులతో నాల్గవ స్థానంలో ఉంది.విదేశీ గడ్డపై 500 టెస్టులు ఆడిన మొదటి జట్టుగా కూడా ఇంగ్లాండ్ మరో రికార్డ్ సృష్టించింది. ఈ లిస్టులో 404 టెస్టులతో ఆస్ట్రేలియా రెెండు, 268 టెస్టులతో భారత్ మూడవ స్థానంలో ఉంది.