IND vs ENG 3rd Test: రోహిత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్

IND vs ENG 3rd Test: రోహిత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్

రాజ్ కోట్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 326/5 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మరో 119 పరుగులు జోడించి 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్(37), కెరీర్ లో తొలి టెస్ట్ ఆడుతున్న జురెల్(46)  పర్వాలేదనిపించారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 77 పరుగులు జోడించి భారీ స్కోర్ అందించారు. స్వల్ప వ్యవధిలోనే  ఈ జోడీ పెవిలియన్ కు చేరింది. రెహన్ అహ్మద్ వీరిద్దరిని ఔట్ చేశాడు.  
 
అశ్విన్- జురెల్ జోడి పెవిలియన్ చేరాక.. భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసేలా కనిపించినా పేసర్లు బుమ్రా (26), సిరాజ్(3) ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా బుమ్రా తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఈ పేస్ బౌలర్ హిట్టింగ్ కి డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ బాగా ఎంజాయ్ చేశాడు. చివరి వికెట్ కు సిరాజ్ తో 30 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు మూడు వికెట్లు పడగొట్టాడు. హర్టీలి, రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రూట్, ఆండర్సన్ కు తలో వికెట్ లభించింది.

తొలి రోజు ఆటలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ (131), జడేజా (112) సెంచరీలతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. వీరికి తోడు కెరీర్ లో నిన్న తొలి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (66 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 62) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. యంగ్ ప్లేయర్లు జైస్వాల్(10) గిల్(0), పటిదార్ (5) విఫలమయ్యారు.