
ఇంటర్నేషనల్ క్రికెట్కు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, కోచ్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ నాకు చాలా ఇచ్చింది..
తన క్రికెట్ ప్రయాణంలో ఎంతో మందిని కలిశానని..ప్రపంచాన్ని చుట్టి వచ్చానని మోర్గాన్ తెలిపాడు. ఎన్నో జట్ల తరపున ఆడటం గౌరవంగా భావిస్తునట్లు చెప్పాడు. క్రికెట్ తనకు ఎన్నో జ్ఞాపకాలను అందించిందని వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తాను క్రికెట్లో ఉండే సాహసం, సవాళ్లను కోల్పోతానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు.
ఐర్లాండ్ తరపున 2006లో క్రికెట్లో అరంగేట్రం చేసిన ఇయాన్ మోర్గాన్ .. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇక 2015లో ఇంగ్లా్ండ్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత 2019లో కెప్టెన్ గా ఇంగ్లండ్కు తొలి వన్డే వరల్డ్ కప్ను అందించాడు. తన క్రికెట్ కెరీర్లో మొత్తం 16 టెస్టులు ఆడిన మోర్గాన్ 700 పరుగులే చేశాడు. బెస్ట్ స్కోరు 130 పరుగులు. ఇక 248 వన్డేల్లో 7701 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలున్నాయి. 115 టీ20ల్లో 14 హాఫ్ సెంచరీలతో సహా 2458 పరుగులు చేశాడు.