IND vs ENG 4th Test: స్పిన్నర్లు తిప్పేసినా.. క్రాలి నిలబెట్టాడు: హోరాహోరీగా రాంచీ టెస్ట్

IND vs ENG 4th Test: స్పిన్నర్లు తిప్పేసినా.. క్రాలి నిలబెట్టాడు: హోరాహోరీగా రాంచీ టెస్ట్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రాంచీ టెస్టు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో టీ విరామానికి 120 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. బెయిర్ స్టో(30), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (0) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్రస్తుతం 166 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉండటంతో ఇంగ్లీష్ జట్టు మరో 100 పరుగులు చేసినా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

46 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు అశ్విన్ అడ్డు కట్ట వేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో రూట్, క్రాలి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్ మరోసారి రూట్ వికెట్ తీసి ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రాలి అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బెయిర్ స్టో తో కలిసి వేగంగా ఆది భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 

మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గుతున్న సమయంలో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన క్రాలి (60) తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(4)ను ఔట్ చేసి మ్యాచ్ ను భారత్ వైపుకు తిప్పాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.