వామ్మోర్గాన్.. ఇదేం కొట్టుడు : ఇంగ్లండ్ స్కోరు 397/6

వామ్మోర్గాన్.. ఇదేం కొట్టుడు : ఇంగ్లండ్ స్కోరు 397/6
  • వన్డే రికార్డు బద్దలు కొట్టిన మోర్గాన్
  • 17 సిక్సర్లతో రోహిత్ శర్మ-ఏబీ డివిలీర్స్-క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డ్(16) బ్రేక్ చేసిన మోర్గాన్
  •  వన్డేల్లో వరెస్ట్ బౌలింగ్ ఎకానమీ నమోదుచేసిన రషీద్ ఖాన్(9 ఓవర్లలో 110 రన్స్)
  • ఓ వన్డే మ్యాచ్ లో ఎక్కువ సిక్సర్లు వచ్చినవి రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే
  • రషీద్ ఖాన్ బౌలింగ్ లో 7 సిక్సులు కొట్టిన మోర్గాన్
  • మొత్తం స్కోరులో 39 శాతం పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చినవే..

మాంచెస్టర్ : పరుగుల బీభత్సం. రన్స్ ఉప్పెన. వామ్మో.. ఏం కొట్టుడు అది. ఆఫ్గనిస్థాన్ ను కలలో కూడా వెంటాడే పరుగుల వేట అది. ఇవాళ ఆప్ఘానిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ 2019 లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కు పరుగుల పూనకమొచ్చింది. మొత్తం 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 రన్స్ చేశారు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్.

35 ఓవర్లదాకా ఒక ఎత్తు. ఆ తర్వాత 15 ఓవర్లు మరో ఎత్తు. 35 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 199/2. రన్ రేట్ 5.68

అప్పటికి జో రూట్ 53 రన్స్ తో.. ఇయాన్ మోర్గాన్ 24 బాల్స్ లో 26 రన్స్ తో ఉన్నారు.

మరో 15 ఓవర్లు ముగిసేసరికి అంటే.. 50 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 397/6. రన్ రేట్ 7.94

అంటే… 35 ఓవర్లలో కొట్టినన్ని పరుగులను.. మిగతా 15 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు కొట్టేశారు. 15 ఓవర్లలోనే 198 రన్స్ సాధించారు ఇంగ్లీష్ ప్లేయర్లు.

మోర్గాన్ పిచ్చకొట్టుడు

ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్లకు లిటరల్ గా సుస్సు పోయించారు ఇంగ్లండ్ ప్లేయర్లు. మోర్గాన్ .. పిచ్చకొట్టుడు కొట్టడంతో.. స్కోరు కొండంతలా పెరిగిపోయింది. ఇన్నింగ్స్ 40 ఓవర్ల దగ్గర ఉన్నప్పుడు మోర్గాన్ పరుగులు 43 బాల్స్ లో 67 రన్స్. ఔటయ్యేసరికి అతడి స్కోరు 71 బంతుల్లో 148. అంటే.. 28 బాల్స్ లోనే 81 రన్స్ చేశాడన్నమాట. 57 బాల్స్ లో సెంచరీ దాటేశాడు మోర్గాన్. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. ఇది పరుగుల సునామీ అనాలో.. క్రికెట్ టోర్నడో అనాలో క్రికెట్ విశ్లేషకులకే అంతుబట్టడం లేదు.

మోర్గాన్ ఇన్నింగ్స్ లో 17 సిక్సులు 4 ఫోర్లు ఉన్నాయి. వరల్డ్ కప్ లో మోర్గాన్ సాధించింది అత్యంత వేగవంతమైన నాలుగో సెంచరీ. అత్యధిక సిక్సుల రికార్డ్ కూడా మోర్గాన్ దే.

విన్స్ 26, బెయిర్ స్టో 90, రూట్ 88, మొయిన్ ఆలీ (9 బాల్స్ లో 31… 4 సిక్సులు) రాణించడంతో.. ఇంగ్లండ్ నమ్మశక్యంకాని  స్కోరు సాధించింది.

పాపం రషీద్ ఖాన్

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నారు ఇంగ్లండ్ ప్లేయర్లు. అంతర్జాతీయ క్రికెట్ లో మంచి బౌలర్ గా పేరు తెచ్చుకుంటున్న రషీద్ ఖాన్ కు ఈ మ్యాచ్ ఓ పీడకల. అతడు 9 ఓవర్లు వేస్తే.. అందులో 110 రన్స్ పిండుకున్నారు ఇంగ్లండ్ బౌలర్లు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఏడు సిక్సర్లు బాదాడు మోర్గాన్.