క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సారా టేలర్‌

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సారా టేలర్‌

లండన్‌ : మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్‌కీపర్‌ గా పేరు సాధించిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సారా టేలర్‌ (30).. ఆటకు
గుడ్‌ బై చెప్పింది. గత కొన్నేళ్లుగా ఆమె దీర్ఘకాలిక ఆందోళన సమస్యతో ఇబ్బందులు పడుతున్నది. దీంతో క్రికెట్‌ పై సరిగా దృష్టిపెట్టలేక రిటై
ర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నది. 17 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ తరఫున 2006లో అంతర్జా తీయ క్రికెట్‌ లోకి అరంగేట్రం చేసిన సారా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 226 మ్యాచ్‌ లు ఆడింది. 6553 రన్స్‌ చేసింది. ఇంగ్లండ్‌ తరఫున అత్యధి క పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌ గా రికార్డులకెక్కింది.కీపర్‌ గా 232 ఔట్లలో భాగం పంచుకోవడం మహిళల క్రికెట్‌ లో రికార్డు. 13 ఏళ్లకెరీర్‌ లో ఇంగ్లండ్‌ సాధించిన అత్యద్భుతవిజయాల్లో సారా పాత్ర కీలకం. రెండు వన్డేవరల్డ్‌‌ కప్స్‌ (2009, 2017), ఓ టీ20 కప్‌‌ (2009) సాధించిన జట్లలో సభ్యురాలు. 2017వరల్డ్‌‌కప్‌‌లో ఆమె ఆడిన రెండు ఇన్నిం గ్స్‌ లను ఎప్పటికీ మర్చిపోలేం. సెమీస్‌ లో సౌతాఫ్రికాపై 54 రన్స్‌ , ఫైనల్లో ఇండి యాపై 45 పరుగులు చేసి ఇంగ్లండ్‌ ను గెలిపించింది. అలాగే యాషెస్‌ సిరీస్‌గెలిచిన టీమ్‌ లోనూ సారా మెంబర్‌ గా ఉంది.