ఇరాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం

ఇరాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం
  • ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేడు

అర్జెంటీనా x సౌదీ అరేబియా
  మ. 3.30 నుంచి డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ x ట్యునీసియా 
  సా. 6.30 నుంచి మెక్సికో x పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  రా. 9.30 నుంచి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ x ఆస్ట్రేలియా
  రా.12.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18, జియో టీవీలో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దోహా: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌ను ఇంగ్లండ్‌‌ టీమ్‌‌ గ్రాండ్‌‌ విక్టరీతో షురూ చేసింది. బుకాయో సకా, మారస్క్‌‌ రష్‌‌ఫోర్డ్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో సోమవారం జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ 6–2తో ఇరాన్‌‌ను చిత్తు చేసింది. గతేడాది యూరోపియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో పెనాల్టీను మిస్‌‌ చేసి ఫ్యాన్స్‌‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సకా, రష్‌‌పోర్డ్‌‌ ఈసారి హీరోలయ్యారు. ఇద్దరూ కలిసి మూడు గోల్స్‌‌లో పాలు పంచుకున్నారు. 

ఖలీఫా ఇంటర్నేషనల్‌‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో సకా (43, 62వ నిమిషాల్లో) డబుల్‌‌ గోల్స్‌‌తో సత్తా చాటాడు. బెల్లింగ్‌‌హామ్‌‌ (35వ ని.), రహీమ్‌‌ (స్టెర్లింగ్‌‌ 45+ 1వ ని.), రష్‌‌ఫోర్డ్ (71వ ని.), జాక్‌‌ గ్రియలిష్‌‌(90వ ని) తలో గోల్‌‌ చేశారు. ఇరాన్‌‌ తరఫున మెహ్ది తరెమి65వ నిమిషంతో పాటు ఎక్స్‌‌ట్రా టైమ్‌‌ 13వ నిమిషంలో రెండు గోల్స్‌‌ సాధించాడు. కాగా, రాత్రి జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో  నెదర్లాండ్స్‌‌ 2–0తో సెనెగల్‌‌పై థ్రిల్లింగ్‌‌ విక్టరీ సాధించింది. గప్కో (84 ని.), క్లాసెన్‌‌ (90+9 వ ని.) చివరి నిమిషాల్లో రెండు గోల్స్‌‌తో డచ్‌‌ టీమ్‌‌ను గెలిపించారు.