
జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. గురువారం (మే 22) నాటింగ్ హమ్ వేదికగా ట్రెంట్ బ్రిడ్జ్ లో ప్రారంభమైన మ్యాచ్ మూడు రోజులకే ముగిసింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ప్రత్యర్థి జింబాబ్వేను చిత్తు చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ పట్టిన ఒక క్యాచ్ సంచలనంగా మారింది. వన్ హ్యాండెడ్ తో పట్టిన ఈ క్యాచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. స్టోక్స్ వేసిన బంతిని వెస్లీ మాధేవెరే కట్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ కు తగిలిన ఈ బంతి స్లిప్ కార్డన్ పైకి వెళ్తోంది. ఈ బంతికి సెకండ్ స్లిప్ లో ఉన్న బ్రూక్ ఒంటి చేత్తో ఎగిరి కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దాదాపు ఆసాధ్యమైంది ఈ క్యాచ్ ను బ్రూక్ అందుకోవడంతో స్టోక్స్ బిత్తర పోయాడు. ఆశ్చర్యపోతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నెట్టింన్ట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వికెట్ తో మాధేవేరే 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. బెన్ డకెట్ (140), క్రాలీ (124), ఓలీ పోప్ (171) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ కి దిగిన జింబాబ్వే 255 పరుగులకు ఆలౌట్ అయింది. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన షోయబ్ బషీర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
"Ben Stokes can barely believe it."
— Wisden (@WisdenCricket) May 24, 2025
A sensational catch by Harry Brook 💪#ENGvZIMpic.twitter.com/AW1M01gbUn