హిందీ, సంస్కృత భాషాలను రుద్దాలని చూస్తే ఊరుకునేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందీ, సంస్కృత భాషలకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ ఇతర భాషలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండి పడ్డారు. హిందీ ఇంగ్లీష్ పైన ఎక్కువగా డిపెండ్ కావటం వలన పిల్లల్లో ఉన్న న్యాచురల్ గా ట్యాలెంట్ దెబ్బతింటుందని అన్నారు.
శనివారం (నవంబర్ 01) కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ, సంస్కృత భాషలకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ ఇతర రాష్ట్రాలపై రుద్దాలని చూస్తున్నారని అన్నారు. ప్రాంతీయ భాషాలను నిర్వీర్యం చేసే ధోరణిలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు.
కేంద్రం కర్ణాటకను నిర్లక్ష్యం చస్తోందని అన్నారు సిద్ధరామయ్య. కర్ణాటకపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కర్ణాటక ఎంతో కంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి రూ.4.5 లక్షల కోట్ల రెవెన్యూ ఇస్తుంటే తిరిగి పావలా వంతు కూడా రాష్ట్రానికి చేరట్లేదని ఆరోపించారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాను హింది, సంస్కృతం కోసం ఖర్చు చేస్తూ ఇతర ప్రాంతీయ భాషలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
యాంటి-కన్నడ శక్తులకు వ్యతిరేకంగా కన్నడ ప్రజలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో స్థానిక భాషను విస్మరిస్తూ హిందీ, ఇంగ్లీష్ భాషలపైనే ఎక్కువ ఆధారపడటం సరికాదని అన్నారు. పిల్లలు వారి మదర్ టంగ్ లోనే ఆలోచిస్తారు, మాట్లాడతారు, కలలు కంటారు.. అందుకోసం వారి మతృభాషలోనే బోధన చేస్తారు. కానీ ఇక్కడ ఇంగ్లీష్, హిందీతో పిల్లల ట్యాలెంట్ దెబ్బతింటుందని అన్నారు. మాతృ భాషా మాద్యమంలో విద్యా వ్యవస్థ ఉండేలా చట్టాలు తేవాల్సి అవసరం ఉందన్నారు.
