ఆరోగ్యశ్రీ వసూళ్లపై విచారణకు కమిటీ

ఆరోగ్యశ్రీ వసూళ్లపై విచారణకు కమిటీ

నిజామాబాద్, వెలుగు : నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులు ఆరోగ్య శ్రీ స్కీమ్ కింద పేషెంట్​కు గుండె ఆపరేషన్​ చేసి రూ.80 వేల బిల్లు వసూలు చేసిన ఘటనపై విచారణ మొదలైంది. డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​అంజన, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్​ స్వప్న, జీజీహెచ్​లోని ఆయా విభాగాల హెచ్​వోడీలు సునీత, రవి నాగప్రసాద్​, శ్రీనివాస్​తో కూడిన కమిటీని విచారణకు కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు గురువారం అపాయింట్​చేశారు.

వారంలో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. నవీపేట మండలానికి చెందిన పిట్ట నారాయణ (36) గుండె నొప్పితో  ఈనెల 8న హాస్పిటల్​లో చేరాడు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్​ చేసేందుకు 10న అప్రోవల్​తీసుకొని16న ఆపరేషన్​ చేశారు. 17 తేదిన పేషెంట్​మరణించడంతో తమ నుంచి రూ.80 వేల బిల్లు తీసుకున్నారని అతని కుటుంబీకులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.