అలంపూర్, వెలుగు : అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని శనివారం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మధు మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో నేరుగా మాట్లాడి పంటల కొనుగోలు, తూకం, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వర్ష సూచన ఉన్న నేపథ్యంలో, రైతులు తమ ధాన్యాన్ని త్వరగా విక్రయించుకునేలా చూడాలని, ఇందుకోసం ఆదివారం కూడా పనులు కొనసాగించేలా హమాలీలను ఒప్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు, హమాలీలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
