హైదరాబాద్, వెలుగు: ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్ లీజింగ్ 2023 లో ఏడు భారతీయ నగరాలలో 179 శాతం వృద్దిని నమోదు చేసిందని సీబీఆర్ఈ భారతదేశం, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా చైర్మన్, సీఈవో అన్షుమాన్ మ్యాగజైన్ తెలిపారు.
వినోద రంగంలో 2023లో మొత్తం లీజింగ్ 0.66 మిలియన్లు చదరపు అడుగులుగా ఉందన్నారు. లీజింగ్‌లో భారీ పెరుగుదల కనిపించిందని చెప్పారు. 2023లో మొత్తం రిటైల్ లీజింగ్ 9 శాతమని, 2022లో 5 శాతంగా ఉండేదనిఅన్నారు. వినోద విభాగంలో సినిమా థియేటర్లు, గేమింగ్ ఆర్కేడ్‌లు, పిల్లల ఆట స్థలాలతో సహా వివిధ సౌకర్యాలు ఉంటాయని అన్షుమన్ వివరించారు.
