ఉత్సాహంగా ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు

ఉత్సాహంగా ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు

తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఓటర్లు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయినా వెంటనే.. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ఓటర్లు. పల్లె, పట్నం అని తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే తరలిరావటం విశేషం. ఉదయం 9 గంటల వరకే చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు కనిపించాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది. చలిని సైతం లెక్క చేయకుండా మొదటగా ఓటు వేయాలనే ఉత్సాహం కనిపించింది ఓటర్లలో. చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి.