పర్యావరణహిత స్కూలు ‘సెక్మల్ ’ ఒక్కటే

పర్యావరణహిత స్కూలు ‘సెక్మల్ ’ ఒక్కటే

అదో మంచి ప్రపంచం. పచ్చ బంగారు లోకం. చుట్టూ మట్టి గుట్టలు.. అల్లంత దూరాన గలగలమంటూ వినిపించే సింధూ కెరటాలు. హిమాలయ పాదాల చెంత నెలవు. దాదాపు ఫోన్లు పనిచేయవు. వైఫై రాదు. అంతా పర్యావరణం మీదే ధ్యాస. అదో స్కూలు. పిల్లలకు పాఠాలతో పాటు పర్యావరణంపై క్రమశిక్షణ నేర్పుతున్న స్కూలు. ప్రపంచంలోనే పర్యావరణహిత పాఠశాల బహుశా అదొక్కటే కావొచ్చు..

సెక్మల్ .. పూర్తిగా చెప్పుకుంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్​ ఆఫ్​ లద్ధాఖ్​. ఆ స్కూలు పేరదే. జమ్మూకశ్మీర్​ లోని లద్ధాఖ్​లో ఉందది. 3.35 కిలోమీటర్ల మేర విస్తరించింది. చుట్టూ కొండలే కాబట్టి ఆ స్కూల్లో తప్ప ఎక్కడా చెట్లు కనిపించవు. చలికాలం వచ్చిందంటే చాలు.. అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయి బాటలేకుండా పోతుంది. అంతేకాదు.. ఈ స్కూలు కోసమే ప్రత్యేకంగా టైం జోన్ కూడా ఉంది. లద్ధాఖ్​ స్కూల్ సిస్టంలో చదువుతూ పది పరీక్షలు తప్పిన వారికి మాత్రమే అందులోకి అనుమతి ఉంటుంది. టీచర్లతో పాటు యూనివర్సిటీ విద్యార్థులూ కోర్​ టీంలో సభ్యులుగా ఉంటారు.

గంటా రెండు గంటలు పర్యావరణం మీదే
రోజూ గంటా రెండు గంటలు విద్యార్థులకు పర్యావరణం గురించి క్లాసులు చెబుతామని స్కూల్ డైరెక్టర్ ​కొంచొక్ నోర్గే చెప్పారు. లెక్కలూ ఉంటాయనుకోండి. కానీ, ఆ లెక్కలు మన స్కూల్ లెక్కల్లా ఉండవు మరి.వసంత కాలంలో వచ్చే నీళ్లు చెట్ల పెంపకానికి సరిపోతాయా? సోలార్​ కుక్కర్​లో వంట చేయడానికి ఎంతహీట్​ కావాలి? ఇలాంటి పర్యావరణానికి సంబంధించిన లెక్కలే ఉంటాయి. ఇక్కడ సోలార్​ కుక్కర్​ చాలాస్పె షల్ గురూ. ఎందుకంటే.. అది పనిచేయడానికి ఏకరెం టూ అవసరం లేదు. జస్ట్​ సూర్యు డి వేడి కావాలిఅంతే. అందుకు అనుగుణంగా కాంతి ని తీసుకునివేడిని పుట్టిం చేందుకు స్కూల్ గోడలకు సౌర అద్దాలను పెట్టారు . అవి కాంతి ని నేరుగా ఆ కుక్కర్​ పెట్టేటేబుల్ మీదకు పంపించే స్తాయి . ఆ వేడికి కుక్కర్​ పనిచేస్త ుందన్నమాట. ప్రస్తుతానికి కేవలం నీళ్లు, పాలు కాగబెట్టేం దుకు మాత్రమే ఆ కుక్కర్​ను వాడుతున్నారు.

తమ వంతు సాయం
అయితే, ఎక్కడో మూలకు ఉన్న ఆ స్కూలు సిద్ధాంతాలు పక్క ఊళ్లకు ఇప్పుడిప్పుడే పాకుతున్నాయి. ఆ స్కూలు పాత విద్యార్థులు వాళ్ల వాళ్ల ఊర్లలో పర్యావరణానికి సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు . అందులో ఒక విద్యార్థి ఉర్గెయిన్ నుర్బు. తన గ్రామంలో ఎన్విరాన్మెంటల్ యూత్​ క్యాంపును నిర్వహిస్తున్నాడు. షారా అనే ఆర్కిటెక్ట్‌‌‌‌.. చెక్క బెరడు,గడ్డి, బురదతో రెడీమేడ్ బిల్డింగ్​ బ్లాకులను తయారుచేస్తోంది. ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు తనవంతు సాయం చేస్తోంది. అందులోని పాత విద్యార్థులు చాలా మంది ఇప్పుడు తమ వంతు సాయం చేస్తున్నారు. వారిలాగే అందరూ తలో చేయి వేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది. మీరేమంటారు?

పేడతో బయోగ్యాస్
అప్పట్లో ఊళ్లలో పేడతో తయారు చేసిన బయోగ్యాస్ గురించి తెలిసే ఉంటుంది. ఈస్కూల్లోనూ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. నోర్గేనే స్వయంగా బయోగ్యాస్ మీథేన్ డైజెస్టర్​ను తయారు చేశారు. ఆవు పేడను నీళ్లతో కలిపిదానిని పైపుల ద్వారా ఆ డైజెస్టర్​లోకి పంపిస్తారు. కొన్ని రోజుల పాటు అలాగే పెట్టేస్తారు .గ్యాస్ ఎక్కువయ్యాక దానిని స్టీల్ వూల్ తోఫిల్టర్​ చేసి ప్లాస్టిక్ రిజర్వ్​ ట్యాంకులోకి పంపి స్టోర్​ చేస్తారు. ఆ గ్యాస్ నే వంటలు చేసేందుకు వాడుకుంటారు. అంతేకాదు, ఆవుల పేడనేకిచెన్ గార్డెన్ కు ఎరువుగా వాడుతుంటారు.

ఆవుల కోసం ఓ షెడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మూడు ఆవులను పెంచుతున్నారు . వాటికికర్జామా, థోట్కర్​, షెయ్మా అని పేర్లు పెట్టారు. ప్రతిస్టూడెంట్​కూ ఏదో ఒక పని అప్పగిస్తారు. వాళ్లకు కేటాయించిన కోటా పనిని వాళ్లు పూర్తి చేయాల్సిందే. తెల్లవారు జామున ప్రతి ఒక్కరూ నిద్రలేవాలి. ఏడు గంటలకు ఏడు నిమిషాల పాటు అందరికీ ధ్యాన (మెడిటేషన్ ) క్లాసు ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు నిషిద్ధం. 30 ఏళ్లుగా అక్కడ దాని ఊసేరాలేదు. అంతేకాదు, స్థానిక బౌద్ధ సంస్కృతి కూడా పర్యావరణంపై మక్కువ పెంచుకునేలా చేసిందని అక్కడి విద్యార్థులు, స్కూలు నిర్వాహకులు చెబుతుంటారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామంటున్నారు. పర్యావరణానికి మేలు చేస్తే మేలు జరుగుతుందని, దానికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే హానేజరుగుతుందని అంటారు.