EPFO కొత్త ఫీచర్: ఇప్పుడు PF ట్రాన్స్ఫర్, విత్‌డ్రా, అడ్వాన్స్‌లు, రీఫండ్‌లు అన్ని ఈజీగా

EPFO కొత్త ఫీచర్: ఇప్పుడు PF ట్రాన్స్ఫర్, విత్‌డ్రా, అడ్వాన్స్‌లు, రీఫండ్‌లు అన్ని ఈజీగా

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పారదర్శకత, పనితీరు, EPFO వినియోగదారుల సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు  తెలిపారు.

అలాగే ఈ మార్పుల వల్ల ప్రావిడెంట్ ఫండ్ (PF) సర్వీసెస్ మరింతగా సులభం అవుతాయి. దీంతో పాటు పీఎఫ్ క్లెయిమ్ల ప్రాసెసింగ్ సమయం తగ్గి, EPFO వినియోగదారుల ఇంకా సంతృప్తి చెందుతారని ఆయన చెప్పారు. 

కొత్త ప్రావిడెంట్ ఫండ్ (PF) సేవలు:
*పాస్‌బుక్ లైట్: మీ పీఎఫ్ వివరాలను సులభంగా చూసుకోవచ్చు.
*ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ ట్రాన్స్ఫర్: ఇప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడానికి  అనెక్సర్ K ఫామ్ ఆన్‌లైన్‌లో లభిస్తుంది.
*ఫాస్ట్ క్లెయిమ్స్ పరిష్కారం: పీఎఫ్ క్లెయిమ్స్ మరింత వేగంగా అవుతాయి, ఎందుకంటే వాటిని చెక్ చేసే ప్రక్రియ చాల సులభం  చేశారు.

'పాస్‌బుక్ లైట్' కొత్త ఫీచర్: ఇకపై మీరు మీ PF అకౌంట్ వివరాలను ఇంకా ఈజీగా  చూసుకోవచ్చు. గతంలో మీ PF పాస్‌బుక్ చూడాలంటే వేరే పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 'పాస్‌బుక్ లైట్' అనే కొత్త ఫీచర్ ద్వారా మీ సాధారణ EPFO లాగిన్‌తోనే PF వివరాలను చూసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఒకే లాగిన్‌తో మీ అకౌంట్లో ఎంత PF డబ్బు ఉందో, మీరు ఎంత కట్టారో, ఎంత డ్రా చేసుకున్నారో వంటి వివరాలను ఒకే దగ్గర చూసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ లాగిన్‌లు చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా మీ పని సులభం అవుతుంది. మీ PF డేటాను చూడాలనుకుంటే, పాత పాస్‌బుక్ పోర్టల్ కూడా ఎప్పటిలాగే ఉంటుంది.

ALSO READ : GST కింద పెట్రోల్, మందు రేట్లు ఎందుకు తగ్గలేదు: వాటిని మనుషులు వాడరా ఏంటీ..? జనంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్

ఇప్పటివరకు ఉద్యోగం మారినప్పుడు PF అకౌంట్ ట్రాన్స్ఫర్  చేసేటప్పుడు 'annexure K' (బదిలీ సర్టిఫికేట్) అనే సర్టిఫికేట్ కేవలం PF ఆఫీసుల వద్ద ఉండేది. annexure K అంత ఈజీగా దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ నేరుగా EPFO పోర్టల్ నుండి PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

EPFO ఇప్పుడు క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడానికి కొన్ని అధికారాలను కింద స్థాయి అధికారులకు ఇచ్చింది. ఇంతకుముందు పెద్ద అధికారులు మాత్రమే చేసే కొన్ని పనులను ఇప్పుడు చిన్న స్థాయి అధికారులకి అప్పగించింది. దీనివల్ల PF బదిలీలు, PF డబ్బు విత్‌డ్రా, PF అడ్వాన్స్‌లు, PF రీఫండ్‌లు,  చెక్కు/ECS/NEFT రిటర్న్‌లు వంటి పనులు ఆలస్యం లేకుండా వేగంగా పూర్తవుతాయి.