ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ

ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ షాకిచ్చింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. ఈ ఏడాదైనా ఎక్కువ వడ్డీ ప్రకటిస్తుందని ఆశించిన పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై నీళ్లు జల్లిన ఈపీఎఫ్ఓ.. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.1శాతంగా నిర్ణయించింది. గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే ఈ మొత్తం 0.40 శాతం తక్కువ కావడం విశేషం. 1977 – 78 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు ప్రకటించడం ఇదే తొలిసారి. అప్పట్లో పీఎఫ్ మొత్తంపై 8శాతం వడ్డీ మాత్రమే ఇచ్చారు. 

ఈపీఎఫ్ఓ 2016 –17, 2018 –19 ఆర్థిక సంవత్సరాల్లో 8.65శాతం చొప్పున వడ్డీ జమచేయగా.. 2013 – 14, 2014 – 15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015 – 16లో అత్యధికంగా 8.8 శాతం వడ్డీ జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019 -20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. అప్పట్లో చందాదారులకు 8.5 శాతం వడ్డీ ఇచ్చారు. గతేడాది సైతం 8.5 శాతం వడ్డీ కొనసాగించారు. ఈపీఎఫ్ఓ నిర్ణయంపై కోట్లాది మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

For more news..

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన కేజ్రీవాల్

సెకండ్ టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన భారత్