EPFO News: పీఎఫ్ సభ్యులకు ఉపశమనం.. ఆ సమస్యకు పరిష్కారం..

EPFO News: పీఎఫ్ సభ్యులకు ఉపశమనం.. ఆ సమస్యకు పరిష్కారం..

PF News: ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు కోసం పీఎఫ్ సౌకర్యం తీసుకురాబడింది. దీంతో దేశంలోని 7 కోట్ల మంది ఉద్యోగులు ప్రస్తుతం ప్రయోజనం పొందుతున్నారు. అయితే పీఎఫ్ మెుత్తం విత్‌డ్రా, బదిలీ సమయంలో ఎదుర్కొంటున్న కీలక సమస్యకు పరిష్కారం తీసుకురాబడింది.

ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యుల పీఎఫ్ సొమ్ము బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై పీఎఫ్ సభ్యుని సర్వీస్ కాలంలో ఇద్దరు యజమానుల మధ్య సర్వీస్ ఓవర్‌లాప్ ఉన్నట్లయితే.. PF క్లెయిమ్ ఇకపై తిరస్కరించబడదు. అంటే పీఎఫ్ రికార్డుల్లో ఒకేసారి రెండు వేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పటికీ ప్రాంతీయ కార్యాలయాలు బదిలీ క్లెయమ్ తిరస్కరించటం కుదరదన్నమాట. 

ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యోగి తన ఉద్యోగం మారినప్పుడు, అతను తన పాత యజమాని వద్ద ఉన్న EPF ఖాతా నుంచి కొత్త యజమాని ఖాతాకు PF బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకోవాల్సి ఉంది. కానీ చాలా సార్లు పాత, కొత్త యజమాని మధ్య సర్వాస్ కాలంలో వివాదం తలెత్తుతుంది. అంటే EPFO ​​రికార్డులలో ఒకే తేదీన రెండు వేర్వేరు కంపెనీల్లో పనిచేసిన రికార్డు చూపిస్తుంటుంది. దీంతో ప్రాంతీయ కార్యాలయాలు బదిలీ క్లెయిమ్‌ను తిరస్కరించేవి.

ఇకపై సేవా కాలంలో వైరుధ్యం కారణంగా బదిలీ క్లెయిమ్‌లను ప్రాంతీయ కార్యాలయాలు తిరస్కరించవని EPFO ​​తన ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్ ఓవర్‌లాప్‌ను స్పష్టం చేయాల్సిన అవసరం నిజంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే, అవసరమైన క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి ఇది ఉద్యోగులకు పెద్ద శుభవార్తే. 

అలాగే ఉద్యోగి అన్ని వివరాలను సరిగ్గా తనిఖీ చేసే బాధ్యతను EPFO ​ బదిలీ కార్యాలయాలకు అప్పగించింది. దీంతో బదిలీ సమయంలో ఏర్పడే లోపాల పరిష్కారం వారే చూసుకుంటారు. ఇది సభ్యులకు పెద్ద ఉపశమనం అందిస్తోంది. సర్వీస్ ఓవర్‌లాప్ కారణంతో అనేకమార్లు పీఎఫ్ సొమ్ము బదిలీ క్లెయిమ్స్ తిరస్కరణపై మెుత్తానికి పెద్ద ఉపశమనం లభించింది. అలాగే కొత్త రూల్ అటువంటి సాంకేతిక కారణాల వల్ల క్లెయిమ్స్ రిజెక్ట్ కాకుండా కాపాడుతుంది.