
హైదరాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ మోకాళ్ల నొప్పుల నివారణ కేంద్రం ఇపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్’ ఇప్పుడు బెంగళూరులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇపియోన్ సెంటర్ డైరెక్టర్, ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా బెంగళూరులో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ దారా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అత్యంత అధునాతన ఎక్విప్మెంట్, టెక్నాలజీతో అత్యంత తక్కువ ధరలో క్వాలిటీట్రీట్మెంట్ అందించే ఏకైక పెయిన్ రిలీఫ్ సెంటర్‌గా ఇపియోన్ గుర్తింపు తెచ్చుకుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ప్లాస్మా రీజనరేటివ్ థెరపీ అందుబాటులోకి తెచ్చామని, ఇతర నగరాల్లోనూ తమ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా గతంలో చెన్నై, తాజాగా బెంగళూరులో ఇపియోన్ సెంటర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 10 సెంటర్లను ప్రారంభిస్తామని సుధీర్ దారా తెలిపారు. ఇపియోన్కో ఫౌండర్ డాక్టర్ మినాల్ చంద్ర మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఎంతోమంది మోకాలు, మెడ, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని.. వారికి సరైన ట్రీట్మెంట్ అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ లేకుండా నొప్పి బాధను నివారించడమే తమ లక్ష్యమని, జనం తమను ఆదరించడానికి అదే కారణమన్నారు. తొందరలోనే విశాఖపట్నంలో ఇపియోన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె తెలిపారు.