ఏపీఓ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలి : ఎర్రబెల్లి దయాకర్రావు

ఏపీఓ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలి : ఎర్రబెల్లి దయాకర్రావు

పాలకుర్తి,  వెలుగు: ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ కమ్మగాని శ్రీనివాస్‌ది ప్రభుత్వ హత్యేనని మూడు నెలలుగా జీతాలు రాక ఉద్యోగులు మానసిక వేదన పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన దేవరుప్పుల ఈజీఎస్ ఎపీఓఇటీవల హార్ట్​ ఎటాక్​తో మృతి చెందగా గురువారం ఆయన కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి ప్రభుత్వం చిరుద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు.  శ్రీనివాస్​ కుటుంబానికి రూ. కోటి రూపాయలు ఎక్స్​గ్రేషియా చెల్లిస్తూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్​ చేశారు.