కారుణ్య నియామకాల కోసం పోరాటం కొనసాగిస్తం: ఎర్రోళ్ల నరేశ్​

కారుణ్య నియామకాల కోసం పోరాటం కొనసాగిస్తం: ఎర్రోళ్ల నరేశ్​

కోల్​బెల్ట్/నస్పూర్​, వెలుగు : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, కారుణ్య నియామకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్నామని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం స్టేట్​ప్రెసిడెంట్​ఎర్రోళ్ల నరేశ్​అన్నారు. బుధవారం మందమర్రి మార్కెట్ లోని అంబేద్కర్​విగ్రహం వద్ద సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఏడో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎర్రోళ్ల నరేశ్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల అమలు కోసం సంఘం తరుఫున ప్రాణ త్యాగానికి వెనుకాడబోమన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో కార్మికులను సంఘటితం చేయడంలో సంఘం కీలకంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యం అనుబంధ పరిశ్రమలను స్థాపించాలని డిమాండ్​చేశారు. 

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రెసిడెంట్​దుట లింగస్వామి, మందమర్రి ఏరియా ప్రెసిడెంట్​పట్టి సతీశ్​బాబు, లీడర్లు సొల్లు శ్రీనివాస్, అరుణ, వివిధ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీరాంపూర్​లో ఘనంగా నిర్వహించారు. కార్మిక హక్కులు, సింగరేణి పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని నేతలు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న కార్మికుని విగ్రహానికి పూలమాల వేశారు.