ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ, ఎంఎస్/ ఎండీ పూర్తి చేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. డిసెంబర్ 10 నుంచి 16 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పోస్టుల సంఖ్య: 45. (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్).
విభాగాలు & ఖాళీల వివరాలు :
- కార్డియాలజీ– 07
- సీటీవీఎస్– 02
- నెఫ్రాలజీ –03
- న్యూరోలజీ –05
- న్యూరో సర్జరీ –02
- పీడియాట్రిక్ సర్జరీ– 02
- అనస్థీషియా– 07
- అనస్థీషియా స్పెషలిస్టుతో పాటు సర్జికల్ ఎస్ఎస్ –03
- ఆక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ– 02
- ఐసీయూ– 02
- రేడియాలజీ –07
- యురాలజీ –03
ఎలిజిబిలిటీ: వైద్య సంస్థల (అధ్యాపకుల అర్హతలు) నిబంధనలు –2025 (2025, జూన్ 30 ఎన్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్) ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండాలి. నిర్దిష్ట వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు వివరాలు
- డిసెంబర్ 10 : కార్డియాలజీ, సీటీవీఎస్
- డిసెంబర్ 11: నెఫ్రాలజీ , న్యూరోలజీ
- డిసెంబర్ 12 : న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ
- డిసెంబర్ 15 : అనస్థీషియా, అనస్థీషియా స్పెషలిస్టుతోపాటు సర్జికల్ ఎస్ఎస్/ ఆక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ/ ఐసీయూ
- డిసెంబర్ 16: రేడియాలజీ, యురాలజీ
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు esic.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
