ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ చెల్లించే గడువును పొడిగించింది. గతంలో ఫిబ్రవరికి సంబంధించిన గడువును ఏప్రిల్-15కి పెంచిన ఈఎస్ఐ.. మార్చికి సంబంధించిన కంట్రిబ్యూషన్ ను మే-15కి పెంచింది. అయితే లాక్ డౌన్ మే-3 వరకు పొడిగించిన క్రమంలో ఫిబ్రవరి నెల కంట్రిబ్యూషన్ చెల్లింపు గడువును మే-15 వరకు పెంచింది. దీనివల్ల కంపెనీలకు ఊరట లభించింది.
