విశాక ఎండీ సరోజ వివేకానంద్‌‌కు ఈటీ, ఫెమినా అవార్డ్

V6 Velugu Posted on Mar 31, 2021

  • కంపెనీని గ్రోత్ వైపు లీడ్ చేసినందుకు..
  • విశాక సీఎస్ఆర్ టీమ్ లీడర్ సరోజనే

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: విశాక ఇండస్ట్రీస్‌‌ మేనేజింగ్ డైరక్టర్‌‌‌‌ ఎస్‌‌. సరోజ వివేకానంద్‌‌కు ‘ది ఎకనామిక్‌‌ టైమ్స్‌‌ మోస్ట్ ప్రామిసింగ్ వుమెన్‌‌ లీడర్స్‌‌–2021’ అవార్డ్‌‌ వచ్చింది. కంపెనీని తీర్చిదిద్దడంలో ఆమె చేసిన కృషికి గాను ఎకనామిక్‌‌ టైమ్స్‌‌, ఫ్యాషన్ మ్యాగ్‌‌జైన్‌‌ ఫెమినా కలిసి  ఈ అవార్డ్‌‌ను ఇచ్చాయి. ఆర్గనైజేషన్‌‌ను ముందుకు తీసుకెళ్లడంతోపాటు, ఇండస్ట్రీ మెరుగుపడడంలోనూ ఆమె పాత్రను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డ్‌‌ను ఇచ్చారు. ‘దేశ ఎకానమీకి మహిళలు వెన్నెముక. సాంప్రదాయ అడ్డంకులను దాటుకొని మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని ఈటీ పేర్కొంది. ఈ  సందర్భంగా కంపెనీ, ఇండస్ట్రీ, ఎకానమీ మెరుగుపడడంలో మహిళలు చేసిన కృషికి గాను ‘మోస్ట్‌‌ ప్రామిసింగ్ వుమెన్ లీడర్స్‌‌–2021’ అవార్డ్స్‌‌తో సత్కరిస్తున్నామంది. అంతేకాకుండా ఈ అవార్డ్‌‌ను దక్కించుకున్న మహిళల వ్యాపార జర్నీని వివరిస్తూ ఓ బుక్‌‌ను లాంచ్ చేశారు. ‘ది ఎకనామిక్‌‌ టైమ్స్‌‌ మోస్ట్ ప్రామిసింగ్‌‌ వుమెన్ లీడర్స్‌‌ 2021 కాఫీ టేబుల్‌‌ బుక్‌‌ కవర్‌‌‌‌ ’ పేరుతో ఈ బుక్‌‌ను తీసుకొచ్చారు.  

పర్యావరణానికి అనుకూలంగా బిజినెస్‌‌..

విశాక ఇండస్ట్రీస్ బాధ్యతలను 2009 లో సరోజ తీసుకున్నారు. అప్పటి నుంచి ఇనొవేటివ్‌‌  సెగ్మెంట్లలోకి కంపెనీ  విస్తరించింది. ముఖ్యంగా ఎన్విరాన్‌‌మెంట్‌‌కు హాని చేయని ప్రొడక్ట్‌‌ల వైపు విశాక ఇండస్ట్రీస్‌‌ దృష్టి పెట్టింది. ప్లాస్టిక్ నుంచి దారాలను తయారు చేయడం, వీ నెక్స్ట్‌‌ కింద ఫైబర్ బోర్డులను తీసుకు రావడం వంటి ఇనొవేటివ్ ఆలోచనలతో విశాక ఇండస్ట్రీస్‌‌ ముందుకు నడిచింది. లక్షల చెట్ల నరికివేతను వీ నెక్స్ట్‌‌  ఆపగలిగింది. ఎంతో మంది యంగ్ వుమెన్‌‌కు సరోజ  ఆదర్శంగా నిలుస్తున్నారు. సరోజ నాయకత్వంలోని విశాక ఇండస్ట్రీస్‌‌ కంపెనీ షేర్‌‌‌‌హోల్డర్లు, పార్ట్​నర్లకు మంచి లాభాలను తీసుకొస్తోంది. కస్టమర్లకు నాణ్యమైన, ఇనొవేటివ్‌‌ ప్రొడక్ట్‌‌లను అందిస్తోంది. ఈ ఏడాది మోస్ట్‌‌ ట్రస్టెడ్‌‌ బ్రాండ్‌‌గా సీఎన్​బీసీ లిస్ట్​లో విశాక నిలవడం మరో విశేషం. 

సామాజిక సేవలో విశాక..

విశాక ఇండస్ట్రీస్‌‌ చేస్తున్న సామాజిక సేవల వెనుక సరోజ ఉంటారు. ఆమె నాయకత్వంలోని కంపెనీ సోషల్‌‌ రెస్పాన్స్‌‌బిలిటీ టీమ్‌‌ అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. స్ట్రీట్‌‌ వెండర్లకు సోలార్‌‌ రూఫ్‌‌ టాప్‌‌లను ఫ్రీగా ఇవ్వడం, బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌ ఎడ్యుకేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ కింద పేద విద్యార్ధులకు పెద్ద చదువును అందించడం వంటి  కార్యక్రమాలు ఆమె నాయకత్వంలోనే జరుగుతున్నాయి. వాటర్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌, హెల్త్‌‌ వంటి కీలకమైన సెక్టార్లలో విశాక సోషల్ రెస్పాన్స్‌‌బిలిటీ టీమ్ పనిచేస్తోంది.  ‘మనకంటూ ఒక టీమ్‌‌, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఉన్నారు. వారి ప్రయోజనాల కోసం  మనం పనిచేయాలి. మన ఉద్యోగులు, ఇన్వెస్టర్లు బాగుంటేనే మనం బాగుంటాం’ అని సరోజ ఎప్పుడూ చెబుతుంటారు. ‌‌

Latest Videos

Subscribe Now

More News