ఉచితంగా ‘ఐసొలేషన్‌ కిట్‌’: ఈటల రాజేందర్

ఉచితంగా ‘ఐసొలేషన్‌ కిట్‌’: ఈటల రాజేందర్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా సీరియస్ గా ఉంటే ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అంతగా లేనటువంటి వారిని ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. అటువంటి వారందరికీ సమీప ఆస్పత్రి నుంచి ఉచితంగా ‘ఐసొలేషన్‌ కిట్‌’ అందచేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఈటల రాజేందర్ తెలిపారు. ఈ కిట్ లో ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఆరోగ్య సమాచారాన్ని కూడా తెలుసుకుంటారని ఆయన తెలిపారు. దీని గురించి ప్రస్తావిస్తూ ఆయన తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్ యధావిధిగా మీకోసం..

‘ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ‘ఐసొలేషన్‌ కిట్‌’ ను నేరుగా సిబ్బంది ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లను ఇస్తారు వైద్య సిబ్బంది ఫోన్‌ ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా కిట్ ద్వారా సమకూరుస్తుంది’ అని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

For More News..

అమ్మ వారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిల్

దేశంలోనే మొదటిసారి.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్

మార్కెట్లోకి డైమండ్ మాస్కులు.. ఆర్డరిచ్చి మరీ చేయించుకుంటున్న కొత్త జంటలు