ఓటుతో దెబ్బకొడితే.. ప్రగతిభవన్ లో KCR చెంప చెల్లుమనాలి

ఓటుతో దెబ్బకొడితే.. ప్రగతిభవన్ లో KCR చెంప చెల్లుమనాలి

టీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత తనదే నన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఇప్పడు.. నేను ఏమీ అభివృద్ధి చేయలేదని నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తప్పుచేసినట్లు నిందలు వేసి బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడారు ఈటల.

సమైక్య రాష్ట్రంలో నాపై ఎన్ని నిర్బంధాలు మోపినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసానని తెలిపారు ఈటల రాజేందర్. నన్ను మోసం చేసి బయటకు పంపించడమే కాకుండా.. దమ్ముంటే గెలవమంటే ఛాలెంజ్ స్వీకరించి వచ్చానని అన్నారు. నీవేందో, నేనేందో తేల్చుకునే రోజు ఈనెల 30 అని అన్నారు. ఏ కులానికి ఆ కులపోళ్లు ఓట్లు వేసుకుంటే నడుస్తదా? ఇవి కులాలకు, మతాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలని అన్నారు. 

ఎన్నడు రాని మంత్రులు డీసీఎం వ్యాన్లలో సారా సీసాలు పట్టుకువచ్చి పంచుతున్నారని చెప్పారు ఈటల. ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు లొంగుతలేరని..  నా మీద చివరి అస్త్రం.. పాశుపతాస్త్రం వేస్తాడట అని అన్నారు. ఓటుకు 20 వేల నుంచి 50 వేలు ఇస్తాడట..ఇప్పటికే 300 కోట్లు ఖర్చు చేసాడని తెలిపారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 30 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని.. వెయ్యి కోట్లైనా ఖర్చు చేసి ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ చెబుతున్నాడట అని అన్నారు ఈటల. నాతో పైకి వచ్చిన నాయకులతోనే నన్ను పొడిపించి ఓడిస్తారట అని తెలిపారు. నాతో ఉన్నట్లుండి నెల రోజులకే ఫ్లేట్ ఫిరాయించారు.. ఎందుకు ఫిరాయించారో మీకు తెలుసునని.. వాళ్లు నిజంగా మనుషులు, మమకారం ఉన్నోళ్లైతే.. వాళ్లు కూడా నాకోసమే పనిచేయాలన్నారు. కానీ దళితబంధు, ఫించన్లు పోతాయని బెదిరిస్తున్నారట. నాకు ఓటేస్తే ఇవన్నీ పోతాయా..అని ప్రజలను అడిగారు ఈటల.

నాపై నేనే దాడిచేయించుకుంటానని ప్రచారం చేసే నీచుల భరతం ఈనెల 30న పట్టాలని ప్రజలను కోరారు ఈటల రాజేందర్. ఓటుతో దెబ్బకొడితే.. ప్రగతిభవన్ లో కేసీఆర్ చెంప చెల్లుమనాలన్నారు. రాజేందర్ కు ఓటేస్తామని చెప్పినవాళ్లకు.. నాది కారు గుర్తు అని చెబుతున్నారట. జాగ్రత్తగా ఉండండి... నాది పువ్వు గుర్తు అని తెలిపారు ఈటల .