
న్యూఢిల్లీ: జొమాటో, బ్లింకిట్ బ్రాండ్ల యజమాని క్విక్ కామర్స్ సంస్థ ఎటర్నల్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో క్వార్టర్లో రూ. 65 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. రెవెన్యూ వృద్ధికి క్విక్ కామర్స్ వ్యాపారం ఎంతగానో దోహదపడింది. ఈ ఏడాది మార్చిలో జొమాటో నుంచి ఎటర్నల్‌గా రీ-బ్రాండెడ్ అయిన ఈ కంపెనీ, గత ఆర్థిక సంవత్సరం జూన్-–సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 176 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
గత ఏడాది ఇదే క్వార్టర్‌తో ప్రస్తుత ఫలితాలను పోల్చలేమని, పేటీఎం నుంచి 'మూవీ టికెటింగ్', 'ఈవెంట్స్' వ్యాపారాలను కొనడమే ఇందుకు కారణమని తెలిపింది. జొమాటో ఫుడ్ డెలివరీ నెట్ఆర్డర్వాల్యూ గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగింది. ఎటర్నల్ కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ. 13,590 కోట్లుగా ఉంది.
ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 4,799 కోట్లుగా ఉంది. క్వార్టర్లో మొత్తం ఖర్చు రూ. 13,813 కోట్లు కాగా, ఏడాది క్రితం ఇది రూ. 4,783 కోట్లుగా రికార్డయింది.