సినిమా స్టైల్లో కొకైన్ రవాణా..పొట్టలో కొకైన్ క్యాప్సూల్స్

సినిమా స్టైల్లో కొకైన్ రవాణా..పొట్టలో కొకైన్ క్యాప్సూల్స్

సూర్య నటించిన వీడొక్కడే  చిత్రం గుర్తుందా. అందులో డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు పొట్టలో క్యాప్సూల్స్ ను మింగుతారు. ఎవరికి అనుమానం రాకుండా ఫ్లైట్ లో రవాణా చేస్తారు. సరిగా ఇలాంటి సీన్ దేశ రాజధాని ఢిాల్లీలో జరిగింది. ఓ లేడీ తన పొట్టలో కొకైన్ క్యాప్సూల్స్ ను రవాణా చేస్తూ పట్టుబడింది. 

ఇథియోపియాకు చెందిన ఓ లేడీ తన పొట్టలో కొకైన్ ను రవాణా చేస్తుండగా..ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారు. తన కడుపులో 734 గ్రాముల కొకైన్ క్యాప్సుల్స్ ను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 75 క్యాప్సూల్స్ ను మింగిన ఆమె..వాటిని అధికారుల కళ్లు గప్పి  తరలించేందుకు ప్రయత్నించి చిక్కింది. పట్టుబడిన కొకైన్ విలువ రూ. 11 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.  శస్త్ర చికిత్స ద్వారా ఎయిర్ పోర్టు అధికారులు వాటిని బయటకు తీయించారు.  NDPS చట్టం కింద లేడీపై కేసు నమోదు చేశారు.