యూరోఫిన్స్ క్యాంపస్‌‌ ప్రారంభం

యూరోఫిన్స్ క్యాంపస్‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్  పరిశ్రమలకు టెస్టింగ్ సేవలను అందించే యూరోఫిన్స్  హైదరాబాద్‌‌లోని జెనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్‌‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి  కేటీఆర్ ​ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరోఫిన్స్ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నదని తెలిపారు.  ఇన్నోవేషన్ కోసం ఇక్కడ 'గ్లోబల్ వ్యాలీ ఆఫ్ గ్రోత్' ను స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా యూరోఫిన్స్ రీజినల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ మాట్లాడుతూ యూరోఫిన్స్ హైదరాబాద్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ భారత్‌‌లో తమకు రెండో క్యాంపస్ అన్నారు. ఇది 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉందని చెప్పారు.