అంతరిక్షంలో హోలీ పండుగ.. ఫొటోలు షేర్ చేసిన యూరోపియన్  స్పేస్ ఏజెన్సీ

అంతరిక్షంలో హోలీ పండుగ.. ఫొటోలు షేర్ చేసిన యూరోపియన్  స్పేస్ ఏజెన్సీ

ఫొటోలు చూస్తుంటే.. నక్షత్రాలు కూడా హోలీ ఆడాయా.. గ్రహాలు రంగులు చల్లుకున్నాయా.. అంతరిక్షంలో కూడా మన పండుగ జరిగిందా అన్నట్లు ఉంది కదా. ఈ ఫొటోలను తీసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA). సెలస్టియల్ క్లౌడ్ స్పేస్, ఓపెన్ క్లస్టర్ ఎన్ జీసీ 6530 లో కొంత భాగాన్ని ఫొటోలు తీశారు. అందులో కొన్ని కొత్తగా పుడుతున్న కొన్ని నెబ్యులాలు, నక్షత్రాలవల్ల ఇలాంటి రంగులు ఏర్పడ్డాయి. అవి విడుదల చేసే కాస్మిక్ గాలులు, పొగల వల్ల ఇలాంటి ఆకారాలు ఏర్పడ్డాయి. వీటిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించింది. 

ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ‘మేము కూడా భారతీయ సంప్రదాయ పండుగను జరుపుకుంటున్నాము. అందరికీ హ్యాపీ హోలీ’ అంటూ పోస్టు చేసింది. ఈ ఫొటోలకు ఇప్పటివరకు 14వేల లైక్స్ వచ్చాయి