
ఉక్రెయిన్ లోని ఖర్కివ్ సిటీలో రష్యా చేసిన బాంబు దాడుల్లో భారత విద్యార్థి నవీన్ మృతి చెందడంపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. అమాయక ప్రజలపై సైతం రష్యా విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లో భారత విద్యార్థి మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేశానని చార్లెస్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు యూరోపియన్ దేశాలు మనస్ఫూర్తిగా తమ వంతు సాయం చేస్తున్నాయని ప్రధాని మోడీతో చెప్పినట్లు పేర్కొన్నారు.
The attacks on #Ukraine aim to destroy multilateralism and cause pain and suffering.
— Charles Michel (@eucopresident) March 1, 2022
The world must unite in defence of international law.
కాగా, ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ సిటీపై ఈ రోజు ఉదయం రష్యన్ బలగాలు చేసిన దాడిలో భారత వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణించాడు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ .. ఉదయం ఖర్కివ్‌లో ఒక స్టోర్‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరగడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలాడు. అతడు ప్రస్తుతం ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు.