స్విచ్ బైక్ షోరూమ్​ షురూ

స్విచ్ బైక్ షోరూమ్​ షురూ

స్విచ్ బైక్ షోరూమ్​ షురూ

హైదరాబాద్​, వెలుగు : ఎలక్ర్టికల్ ఫోల్డబుల్ ​సైకిళ్ల తయారీ సంస్థ స్విచ్ బైక్ ఆదివారం హైదరాబాద్​లో రెండవ షోరూమ్​ను  ప్రారంభించింది. గుజరాత్​కు చెందిన  ఈవీ బ్రాండ్​ స్విచ్​ బైక్​ ఎస్​జీ ఆటోమోటివ్స్​తో కలిసి తన రెండవ స్టోర్​ను మాదాపూర్​లో ఓపెన్​ చేసింది. ఈ సందర్భంగా స్విచ్​ బైక్​ ఎండీ రాజ్​కుమార్​ పటేల్​ మాట్లాడుతూ.. హైదరాబాద్​  ఈవీ హబ్​గా అవతరిస్తొందని,  ప్రతి ఇంటికి స్విచ్​ బైక్​ను డెలివరీ చేయడానికి  షోరూమ్​లను ప్రారంభిస్తున్నామన్నారు. మొదటి షోరూం బేగంపేట్​లో ఉండగా, ప్రస్తుతం మాదాపూర్​లో ఓపెన్​ చేశామన్నారు.

త్వరలోనే బెంగుళూరు సిటీలో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూంలో టెస్ట్​డ్రైవ్​ సదుపాయం ఉందని తెలిపారు. ఈ ఐదు మోడల్స్​ను సైకిల్​గానూ వాడొచ్చని పేర్కొన్నారు.  ధరలు రూ. 40వేల నుండి 1.25 లక్షల వరకు ఉంటాయి. వీటిని ఫుల్ చార్జ్​ చేయడానికి రెండున్నర గంటల టైం పడుతుంది. ఫుల్​ చార్జ్​ చేస్తే 60 నుండి 120 కిలోమీటర్ల వరకు గంటలకు వెళ్లవచ్చు. గరిష్ట వేగం 25 కిలోమీటర్లు.  కార్యక్రమంలో  ఎస్​జీ ఆటోమోటివ్స్​ ఎండీ గణపతి సర్వీ, కిషన్​ గోపాల్​, స్విచ్​బైక్​ సీఈఓ చింతన్​ ఖత్రీ తదితరులు పాల్గొన్నారు.