EV sales: ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మంచి గిరాకీ ఉంది. కాలుష్యం, పర్యా వరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జనం ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ బాగా పెరిగిపోయింది. గతేడాది (2023-24) ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు 40.03 శాతం పెరిగాయి. అంటే 1.75 మిలియన్ల యూనిట్ల కార్లు అమ్ముడు పోయాయి. కొన్ని నివేదికల ప్రకారం.. బైకులు, త్రిచక్ర వాహనాలు( ఆటోలు, త్రీవీలర్ బైకులు) ఎక్కువగా అమ్ముడు పోయాయి.
భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) అమ్మకాలు ఆర్థిక సంవత్సరం 2023-24లో 17 లక్షల 52వేల 405 యూనిట్లు పెరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 40.03 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.మొత్తం అమ్మకాల్లో బైకులు, త్రీవీలర్లు అమ్మకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి.
ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాలు 29 శాతం పెరిగి 10లక్షల 09వేల 356 యూనిట్లకు చేరుకన్నాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఇది 57.60 శాతంగా ఉంది.
EV త్రీవీలర్ వాహనాల్లో ప్యాసింజర్, కార్గో వాహనాలు ఎక్కువగా అమ్ముడు పోయా యి. ఇవి దాదాపు 56 శాతం పెరిగి 6 లక్షల 34వేల 969 యూనిట్లుగా ఉన్నాయి.
2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు కూడా భారీగానే పెరిగాయి. ఇంతకు ముందు ఏడాతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ అమ్మకాలు 82 శాతం పెరిగి 99వేల 085 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 85 శాతం వృద్ధితో 3వేల 708 యూనిట్లు పెరిగాయి.
Hero Moto Corp మే 2024లో దాదాపు 4లక్షల 98వేల 123 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది.ఇంతకుముందు ఏడాది 5లక్షల 19వేల 474 యూనిట్లతో ఉండగా.. ఈ ఏడాది 4.1 శాతం సేల్స్ తగ్గింది. నెలవారీ అమ్మకాలు తగ్గడం అనేది కంపెనీకి సవాల్ చేస్తున్నాయి.