గల్ఫ్ లో ఉన్న మన వారిని రప్పించండి

గల్ఫ్ లో ఉన్న మన వారిని రప్పించండి

న్యూఢిల్లీ : గల్ఫ్ లో ఉన్న మన వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఎం. కె రాఘవన్ కోరారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో పరిస్థితి బాగాలేదని ఈ సమయంలో అక్కడున్న మన వారి మంచిచెడులు చూడాల్సిన అవసరముందన్నారు. మన దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించాలని ఆయన పిటిషన్ లో కోరారు. అక్కడే ఉన్న వారికి అవసరమైన ఫెసిలిటీస్ కూడా కల్పించాలన్నారు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) తో మాట్లాడి కరోనా బారిన పడిన వారికి మెడికల్ ట్రీట్ మెంట్, మెడిసిన్ అందేలా చూడాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో పలు సెక్టా్ర్లలో పనిచేసేందుకు మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా పనిలేక ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలవాలంటూ కాంగ్రెస్ ఎంపీ ఎం.కె రాఘవన్ సుప్రీంకోర్టు ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.