ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏం చేద్దాం?

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏం చేద్దాం?
  •     పోలీసులతో చర్చించిన  ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యలపై బల్దియా హెడ్డాఫీసులో మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్, ట్రాఫిక్ డీసీపీలు సుబ్బరాయుడు, అశోక్, ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు.

బస్ షెల్టర్ల నిర్వహణ, అనవసర ప్రాంతాల నుంచి బస్ షెల్టర్ల తరలింపు, మెయిన్ జంక్షన్లలో కొన్ని బస్టాప్‌‌‌‌‌‌‌‌ల వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకుగాను బస్టాప్‌‌‌‌‌‌‌‌ల మార్పును ఖరారు చేసేందుకు ఆర్టీసీ

ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కన్ స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వ్యర్థాల ఏజెన్సీల వాహనాలను  సిటీలోకి అనుమతించే అవకాశంపై కూడా చర్చించారు.

ALSO READ:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే లోకల్‍ బాడీ ఎలక్షన్లు పెట్టాలె: ఎమ్మెల్సీ కవిత

.