విడిపోయి 25 ఏళ్లు అయినా..స్నేహితుని కుటుంబానికి అండగా టెన్త్ క్లాస్ దోస్తులు

విడిపోయి 25 ఏళ్లు అయినా..స్నేహితుని కుటుంబానికి అండగా టెన్త్ క్లాస్ దోస్తులు

విడిపోయి 25 ఏళ్లు అయినా..స్నేహితుడిని మర్చిపోలేదు..అనారోగ్యంతో మరణిస్తే...అతని కుటుంబానికి అండగా నిలిచారు టెన్త్ క్లాస్ దోస్తులు. వృత్తిపరంగా ఒక్కో రంగంలో ఒక్కోచోట స్థిరపడిన చిన్ననాటి మిత్రులంతా స్నేహితుడి మరణవార్త సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. చివరి చూపుకోసం స్నేహితుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. అతడి కుటుంబంతో కలిసి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. అకాలమరణంతో స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థికసాయం చేశారు. 

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్ (42) ఆకస్మికంగా మృతిచెందాడు. అయిటిపాముల జెడ్పీహెచ్ఎస్లో శ్రీనివాస్తో పాటు 1994-95టెన్త్ పూర్తిచేసిన చిన్ననాటి స్నేహితులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. శ్రీనివాస్ కుమార్తె నవ్యశ్రీ పేరున ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. నకిరేకల్ ఎస్ బీఐ బ్రాంచ్ మేనేజర్ పద్మావతి సమక్షంలో డిపాజిట్ పత్రాన్ని శ్రీనివాస్ భార్య మణికి అందజేశారు.