స్టేషన్ ఘనపూర్ పై ఉన్న ప్రేమతోనే రెండు కళ్లను దానం చేశా : ఎమ్మెల్యే రాజయ్య 

స్టేషన్ ఘనపూర్ పై ఉన్న ప్రేమతోనే రెండు కళ్లను దానం చేశా : ఎమ్మెల్యే రాజయ్య 

తాను చనిపోయాక కూడా తన నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తన రెండు కళ్లను దానం చేశానని స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. నియోజకవర్గంపై తనకున్న ప్రేమతోనే కళ్లను దానం చేశానన్నారు. తన రెండు కళ్లు దానం చేసే ముందు ఒక కండీషన్ కూడా పెట్టానని, స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం ప్రజలకే తన కళ్లను ఇవ్వాలని చెప్పానని అన్నారు. తనకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై ఉన్న ప్రేమ అలాంటిదని చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘనపూర్  నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలనే ఆశ తనకు ఉందన్నారు. ‘నా నియోజకవర్గమే నా దేవాలయం.. నా నియోజకవర్గం ప్రజలే నా దేవుళ్లు’ అని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెంలో జరిగిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.