
చేర్యాల, వెలుగు: తాను బతికే ఉన్నానని, పెన్షన్ఇవ్వాలంటూ ఓ వికలాంగుడు ఎంపీడీఓ ఆఫీసు ముందు ఆందోళనకు దిగాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన వికలాంగుడు అంజయ్య చనిపోయాడంటూ రికార్డుల నుంచి పేరు తొలగించి పెన్షన్ఆపేశారు. దీంతో ఆఫీసర్ల తీరును నిరసిస్తూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు శుక్రవారం తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు బొట్ల సుమతి, జిల్లా కన్వీనర్ సుతారి రమేశ్ తదితరులతో కలిసి ధర్నా చేశారు. నాలుగేండ్లుగా తనకు పెన్షన్ఇవ్వడం లేదని వాపోయారు. అంజయ్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయకుంటే ఆందోళను చేపడతామని సుమతి, రమేశ్ హెచ్చరించారు.