ధర తగ్గినా.. బీరు సేల్స్​పెరగలే

ధర తగ్గినా.. బీరు సేల్స్​పెరగలే

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం బీరు అమ్మకాలు పెంచేందుకు ధర తగ్గించినా సేల్స్‌‌ పెరగలేదు. గత నెలతో పోలిస్తే ఈ నెల అమ్మకాలు మరింత తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌‌లో 24 లక్షల కేసులు బీర్లు అమ్మితే.. ఈ నెల బుధవారం వరకు 22 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏడాదిన్నరగా కరోనా భయంతోపాటు ఒక్కో బీరుపై రూ. 30 అదనపు పెంపుతో బీర్లు తాగేందుకు మద్యం ప్రియులు వెనకంజ వేశారు. దీంతో బీర్‌‌ సేల్స్‌‌ పడిపోయాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అన్ని రకాల బీర్లపై రూ. 10 తగ్గిస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా సేల్స్‌‌ మాత్రం పెరగలేదు. బీర్ల ధరలు పెంచడంతో మద్యం ప్రియులు లిక్కర్‌‌కు అలవాటు పడ్డారని, కరోనా భయం పూర్తిగా పోలేదని వైన్స్‌‌ నిర్వాహకులు చెబుతున్నారు. 
సేల్స్​పెంచాలని వేధింపులు..
ఈ నెలలో మద్యం అమ్మకాలు కాస్త పెరిగాయి. బుధవారం వరకు ఓవరాల్‌‌గా రూ. 2,310 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. జూన్‌‌లో మాత్రం రూ. 2070 కోట్ల విలువైన లిక్కర్‌‌ మాత్రమే సేల్​అయింది. అయితే రాష్ట్ర సర్కారుకు ఆబ్కారీ శాఖ నుంచి సరిపడా ఆదాయం రాకపోవడంతో అధికారులు మరింత ఇన్‌‌కం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం ఎక్కువ మొత్తంలో లిఫ్ట్‌‌ చేయాలని వైన్స్‌‌ యజమానులకు టార్గెట్లు పెడుతున్నరు. కొన్ని ఏరియాల్లో ఏకంగా మద్యం అమ్మకాలు పెంచాలని వేధిస్తున్నట్లు తెలుస్తోంది.