అన్ని గాడ్జెట్స్‌కి ఒకే కిట్
ఫోన్ బ్యాక్ కేస్‌ని వారానికి ఒకసారి క్లీన్ చేసినా.. ఫోన్ మీద దుమ్ము కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ క్లీనింగ్ కిట్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు దోమల బ్యాట్ పట్టుకుని వాటితో యుద్ధాలు చేయక్కర్లేదు. ఈ మస్కిట్ ట్రాప్ లైట్‌ని ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇవే కాకుండా.. మరో రెండు ఇంట్రెస్టింగ్ టూల్స్ అండ్ గాడ్జెట్స్ కూడా ఉన్నాయి.
రైడల్లాక్
చాలామంది బైక్, కార్లలో మొబైల్ హోల్డర్లను వాడుతుంటారు. కానీ.. కొన్ని రకాల మొబైల్స్ హోల్డర్లలో ఫోన్ పెడితే మూలలు గీసుకుపోతుంది. పైన ఉన్న గ్లాస్ పగిలిపోతుంది. అలాంటప్పుడు ఈ రైడల్ లాక్ ఫోన్ హోల్డర్ని వాడితే సరిపోతుంది. దీన్ని మెటల్, ప్లాస్టిక్‌తో తయారుచేశారు. దీనికి ఉండే క్రెడిల్ క్లాంప్ వల్ల ఫోన్ మీద చిన్న గీత కూడా పడదు. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. హోల్డర్ని స్క్రూలతో బైక్ హ్యాండిల్ బార్కి బిగించాలి. దాంతో పాటు వచ్చే మెటల్ బోర్డ్ నుండి 3 ఎమ్ స్టిక్కర్‌ని తీసి, ఫోన్ కేస్‌కు అతికిస్తే చాలు. మెటల్ బోర్డ్ లాక్ బేస్‌లోకి వెళ్లి, ఫోన్ హోల్డ్ అవుతుంది.
ధర: 649 రూపాయలు
పోర్టోనిక్స్ క్లీన్ ఎం
ఒక్కోసారి ఇయర్‌ఫోన్స్ నిండా వ్యాక్స్ నిండిపోతుంది. వాటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయాలి. కానీ.. అది అంత ఈజీ కాదు. అందుకే ఇలాంటి గాడ్జెట్స్ క్లీనింగ్ కోసం పోర్టోనిక్స్ కంపెనీ ప్రత్యేకంగా క్లీన్ ఎం అనే ఆల్ ఇన్ వన్ క్లీనర్‌ని తీసుకొచ్చింది. ఇది మొత్తం ఎనిమిది రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, కీబోర్డ్‌లు, ఇయర్‌బడ్స్ లాంటివన్నీ క్లీన్ చేయొచ్చు. అంతేకాదు.. ఇందులో స్ర్పేయర్ కూడా ఉంటుంది. అందులో వాటర్ లేదా క్లీనింగ్ సొల్యూషన్ నింపి గాడ్జెట్స్ మీద స్ప్రే చేసి, దానికి మరో వైపు ఉన్న బ్రష్‌తో తుడవాలి. ఇందులో కీ బోర్డ్‌లోని బటన్స్ ఊడతీసేందుకు ప్రత్యేకంగా ఒక టూల్ కూడా ఉంటుంది. మొబైల్ స్టాండ్‌లా కూడా పనిచేస్తుంది.
ధర: 579 రూపాయలు
దోమల లైట్
ఇంట్లో ఉన్న దోమల్ని చంపేందుకు దోమల బ్యాట్ వాడతారు చాలామంది. అయితే.. అందుకోసం చాలా టైం పడుతుంది. ఆ టైం సేవ్ చేసేందుకు పిర్రాన్ కంపెనీ మస్కిటో ట్రాప్ కిల్లర్‌ని తీసుకొచ్చింది. ఇందులో ఉండే లైట్ దోమలను ఎట్రాక్ట్ చేస్తుంది. దాంతో దోమలు ఆ లైట్వైపు వెళ్తాయి. లైట్ చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ తీగలకు తగిలి చనిపోతాయి. ఎక్కువ శ్రమ పడకుండా... మీ ఇంట్లో దోమల బెడద లేకుండా చేసుకునేందుకు తయారుచేసిందే ఇది.
ధర: 479 రూపాయలు
కాల్మేట్
గేమ్స్ ఆడేవాళ్ల సెల్ ఫోన్స్‌లో.. ఆరేడు గంటల్లోనే ఛార్జింగ్ జీరోకి వచ్చేస్తుంటుంది. దాంతో అందరూ పవర్ బ్యాంక్‌లను వాడుతున్నారు. అందుకే కొన్ని కంపెనీలు స్పెషల్ ఫీచర్లతో పవర్‌బ్యాంక్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాల్మేట్ కంపెనీ కూడా అలాంటి డిజిటల్ పవర్ బ్యాంక్‌ని తీసుకొచ్చింది. ఇది 20000mAh కెపాసిటీతో వస్తుంది. గ్లాస్ బాడీ ఉండడం వల్ల లోపల ఉండే బ్యాటరీ, సర్క్యూట్ లేఅవుట్ బయటికి కనిపిస్తుంది. 23W పవర్ డెలివరీ చేస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. దీనికి ఉండే స్క్రీన్ మీద ఫోన్‌కి ఎంత అవుట్‌పుట్ వెళ్తుందనేది కనిపిస్తుంటుంది. ఒకేసారి నాలుగు డివైజ్‌లను ఛార్జ్ చేస్తుంది.
ధర: 1,949 రూపాయలు
