ఒక్క రూపాయి సంపాదించినా.. మొత్తం ఆస్తి తీసుకోండి..బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ రాసిచ్చిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌

ఒక్క రూపాయి సంపాదించినా.. మొత్తం ఆస్తి తీసుకోండి..బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ రాసిచ్చిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచిన ఓ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన జైపాల్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. తాను పదవిని అడ్డుపెట్టుకొని ఒక్క రూపాయి సంపాదించినా.. తన ఆస్తి మొత్తాన్ని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవచ్చంటూ బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ రాసి ప్రచారం చేస్తున్నాడు.