సాధారణంగా మ్యాజిక్ షోలు చూస్తే మన కళ్లు మనల్ని మాయ చేశాయి అంటారు. కానీ, అది కేవలం మ్యాజిక్ చేస్తేనే కాదు, ఇలాంటి టాలెంట్ చూస్తే కూడా ఆ మాట అనాల్సిందే. శిఖా శర్మ... ఇంటర్నేషనల్ త్రీడీ పెయింటింగ్ ఆర్టిస్ట్. వరల్డ్ రికార్డు హోల్డర్ కూడా. ఈమె తన టాలెంట్‌ని ఉపయోగించి ఇప్పటికే ఎన్నో షోల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో అవార్డ్లు కూడా అందుకుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్‌గా తన టాలెంట్‌ని చూపించింది శిఖా. వీడియో ఆన్ చేయగానే, “ కింద కూర్చుని న్యూస్ పేపర్ చూస్తూ కింద పెడుతుంది. వెంటనే ఆ పేపర్ని ముగ్గు చెరిపేసినట్టు చెరిపేస్తుంది. ఆ తర్వాత ఎర్ర తివాచీ పట్టుకుని అక్కడికి వస్తుంది. ఆమె రాగానే పేపర్ బొమ్మ చెరిపేస్తున్న ఆమె కాస్తా బొమ్మలా మారిపోతుంది. దాంతో ఆ తివాచీని ఆ అమ్మాయి బొమ్మ మీద వేసి తుడిచేస్తుంది. ఆ తర్వాత అయిపోయింది అన్నట్టు ఫొటోకు పోజ్ ఇస్తుంది. అది ఫొటో అనుకునేలోపే మళ్లీ ఒకమ్మాయి ఆ ఫొటోని పెయింటింగ్ వేస్తున్న వీడియో కనిపిస్తుంది” ఇదే ఆ వీడియోలో ఉన్న విషయం. కానీ అన్నింట్లో ఆమె ఎలా ఉంటుంది? అనేది డౌట్. అదే మాయ. ఆ మాయ పేరు ‘‘ట్రిప్పింగ్”. ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే వీడియో ఇది. అయితే ఎన్నిసార్లు చూసినా మన కళ్లు మనల్ని మాయ చేయడం మాత్రం ఖాయం.
