తెలంగాణలోనే అత్యధిక టెండర్.. మూడు నెలలైనా అగ్రిమెంట్ కాలే..

తెలంగాణలోనే  అత్యధిక టెండర్.. మూడు నెలలైనా అగ్రిమెంట్ కాలే..
  • రాష్ట్రంలోనే అత్యధిక టెండర్..
  • మూడు నెలలైనా  అగ్రిమెంట్ కాలే..
  •     రూ.1.02 కోట్లతో నవీపేట మేకల సంత టెండర్
  •     అగ్రిమెంట్​పై అధికారుల నిర్లక్షం 

నవీపేట్, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన నిజామాబాద్​ జిల్లా నవీపేటలోని మేకల సంత, కూరగాయల సంతకు టెండర్ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా అగ్రిమెంట్ పూర్తికాలేదు. నవీపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే మేకల సంతకు తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తుంటారు. 2026–27సంవత్సరం సంత నిర్వహణ కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మార్చ్ 18న టెండర్ నిర్వహించగా 159 మంది పాల్గొన్నారు.

సిరాజోద్దిన్ అనే వ్యక్తి రూ.1.02 కోట్లకు టెండర్ దక్కించుకున్నారు. దీనితో రాష్ట్రంలోనే మార్కెట్ టెండర్ ద్వారా అత్యధికంగా ఆదాయం వచ్చిన గ్రామపంచాయతీగా నవీపేట నిలిచింది. టెండర్ పూర్తి కాగానే నిబంధనల ప్రకారం మూడో వంతు డబ్బు చెల్లించి పంచాయితీ కార్యదర్శి ద్వారా అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ రూ.25.50 లక్షలు చెల్లించి ఎలాంటి అగ్రిమెంట్ లేకుండానే మార్కెట్​లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్ చేతుతెత్తేస్తే పరిస్థితి ఏమిటని పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అగ్రిమెంట్ చేయాలని కోరుతున్నారు.