ఇకపై రోజూ మిక్స్‌‌‌‌డ్ వెజిటేబుల్ కర్రీ..ప్రతి సోమవారం కిచిడీ, వారానికి మూడు గుడ్లు

ఇకపై రోజూ మిక్స్‌‌‌‌డ్  వెజిటేబుల్ కర్రీ..ప్రతి సోమవారం కిచిడీ, వారానికి మూడు గుడ్లు

హైదరాబాద్,వెలుగు: సర్కారు, ఎయిడెడ్ స్కూల్స్​లో పిల్లలకు అం దించే మిడ్‌‌‌‌డే మీల్స్ మెనూ మారింది. ఇక నుంచి డెయిలీ మిక్స్‌‌‌‌డ్ వెజిటేబుల్ కర్రీ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. 

గురువారం కొత్త మెనూను డీఈవోలకు ఆమె పంపిం చారు. 12 నుంచి అన్ని స్కూళ్లలో ఈ మెనూను అమలు చేయాలని ఆదే శించారు. ప్రతి సోమవారం కిచిడీ పెట్టాలని, గురువారం వెజిటేబుల్ బిర్యానీ పెట్టాలన్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో పిల్లలకు గుడ్డు ఇవ్వాల ని ఆదేశించారు. మంగళవారం, శుక్రవారం సాంబార్‌‌‌‌‌‌‌‌ అదనంగా అందించాలన్నారు.