ఈ రైడర్స్ రూట్ సోషల్ సర్వీస్..ప్రతి వీకెండ్ లో ఏదో ఒకచోటికి రైడింగ్  

ఈ రైడర్స్ రూట్ సోషల్ సర్వీస్..ప్రతి వీకెండ్ లో ఏదో ఒకచోటికి రైడింగ్  
  • దూర ప్రాంతాలకు వెళ్లి యాక్టివిటీస్​
  • వెయ్యి మందితో హైదరాబాద్  బైకర్స్ కమ్యూనిటీ
  • మెంబర్లుగా ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర ఎంప్లాయీస్

హైదరాబాద్, వెలుగు : బైక్​ రైడింగ్ అనగానే.. రేసింగ్స్, స్టంట్స్, వందల సీసీల బైక్స్, దద్దరిల్లే సైలెన్సర్ సౌండ్స్..​ ఇవే గుర్తొస్తాయి. హైదరాబాద్​బైకర్స్ కమ్యూనిటీ మాత్రం డిఫరెంట్. బైక్​ రైడింగ్ ను సోషల్​సర్సీస్​గా చేసుకుంది. ప్రతి వీకెండ్ లో బైక్​ రైడింగ్​కు వెళ్లి ఏదో ఒక సర్వీస్​చేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది ఉన్న బైకర్స్​కమ్యూనిటీలో ప్రతి వీకెండ్​ సిటీలో, శివారులో  చెత్తను క్లీన్​ చేయడం, సీడ్​బాల్స్ నాటడం, బ్లడ్​డొనేషన్​క్యాంప్స్​ఏర్పాటు, హెల్మెట్​ వాడకంపై అవగాహన కల్పించడం.. ఇలా పలు రకాల యాక్టివిటీస్​చేస్తూ డిఫరెంట్​ బైక్ రైడర్స్ అనిపించుకుంటున్నారు. 

రైడ్​విత్ సోషల్​సర్వీస్.. 

బైక్​ రైడర్స్​అంటే రోడ్లపై స్పీడ్​గా బైక్స్​నడపడమే అనుకుంటాం. వీళ్లు స్పీడ్​ లిమిట్​ను మెయింటైన్ చేస్తూ,  రైడర్, పిలియన్ ​రైడర్ ఇద్దరూ హెల్మెట్​ధరించి రైడ్​కు వెళ్తుంటారు. జాబర్స్, యూత్, చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రైడ్లలో పాల్గొని సోషల్​యాక్టివిటీస్  చేస్తుంటారు. గతంలో ములుగు​ జిల్లాలోని మేడారం ఏజెన్సీ ప్రాంతంలోని భీమ్ చిల్డ్రన్స్​హ్యాపీనెస్ సెంటర్​ను సందర్శించారు.  అక్కడ చదువుకునే గిరిజన పిల్లలకు స్టేషనరీ అందించారు. సిటీ, శివారులోని వివిధ స్కూళ్లకు వెళ్లి స్టేషనరీ ఇవ్వడంతో పాటు హెల్మెట్​ వాడితే కలిగే ఉపయోగాలు వివరించడం, ‘సే నో టు డ్రగ్స్’​, వికారాబాద్ ​ఫారెస్టులో టూరిస్టులు పడేసిన వేస్ట్​ను సేకరించడం, బ్లాంకెట్స్, ఫుడ్​ డిస్ట్రిబ్యూషన్​, సీడ్​ బాల్స్​ వేయడం.. ఇలా పలు రకాల సేవలు చేస్తూ మిగతా బైక్​ రైడర్ల కన్నా భిన్నంగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

డిఫరెంట్​ప్రొఫెషనల్స్..

హైదరాబాద్ బైకర్స్ కమ్యూనిటీలో అన్ని ఏజ్​గ్రూప్​లకు చెందిన మహిళలు, పురుషులు ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్​, ఇతర జాబ్ లు  చేసేవారు ఉన్నారు. అందరూ ఒకే బైక్స్​ తీసుకురావాలనే రూల్స్​ఏమీ ఉండవు. ఎంప్లాయీస్​ బైడ్​ రైడింగ్​ మీద ఉన్న ప్యాషన్​తో రైడింగ్​లో పాల్గొంటున్నారు. దాదాపు వెయి మంది సభ్యులు ​ఉండగా.. వందకు పైగా క్లబ్​లు ఉన్నాయి. ఎవరూ ఏ సోషల్​ సర్వీస్​ను ఎంచుకున్నా ఆసక్తి​ ఉన్నవారు కూడా వెళ్తుంటారు

 సేఫ్​ రైడ్ ను ప్రమోట్ చేస్తున్నం.. 

2016 నుంచి హైదరాబాద్​బైకర్స్​కమ్యూనిటీలో మెంబర్​గా ఉంటున్న. మా మెయిన్​మోటివ్​సేఫ్​ రైడ్ ను ప్రమోట్ చేయడం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్​ రూల్స్​పాటించాలి. రైడ్​కు వెళ్లేటప్పుడు రైడర్, పిలియన్​ఇద్దరూ హెల్మెట్​ధరించాలి. సోషల్ సర్వీస్​ లో భాగంగా ప్రతి ఏడాది వింటర్​లో బ్లాంకెట్స్​పంపిణీ చేస్తుంటాం. ఈసారి కూడా డిసెంబర్ 30న బ్లాంకెట్లను పంచుతాం. 

కిశోర్, మెంబర్, హైదరాబాద్​ బైకర్స్​కమ్యూనిటీ మెంబర్

సోషల్ సర్వీస్ ను ఎంచుకుంటున్నా..

ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర ఎంప్లాయీస్​ వారం మొత్తం పని ఒత్తిడితో ఉంటారు. వీకెండ్స్​లో ప్రెజర్​నుంచి ఎస్కేప్​ అవ్వొచ్చు. ప్రతి వీకెండ్​లో బైక్​ రైడింగ్​ ట్రిప్​లో ఏదో ఒక సోషల్​ సర్వీస్​ను ఎంచుకుంటాం. ఇది వరకు వికారాబాద్​ఫారెస్ట్​లో సీడ్​బాల్స్​ వేశాం. పేదలకు ఆహారం అందించడం​, స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కల్పించడం వంటి​ ప్రోగ్రామ్స్ ​చేస్తుంటాం. 

 ప్రణీత్, మెంబర్, హైదరాబాద్​బైకర్స్​కమ్యూనిటీ