కేసీఆర్ పదేళ్ల పాలనలో అందరి ఫోన్లు ట్యాప్ : మంత్రి శ్రీధర్ బాబు

కేసీఆర్ పదేళ్ల పాలనలో అందరి ఫోన్లు ట్యాప్ : మంత్రి శ్రీధర్ బాబు

ఫోన్​ట్యాపింగ్​తో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని శ్రీధర్ బాబు స్పష్టం చే శారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఏ విధంగా ట్యాప్​ చేశారో అందరికీ తెలుస్తూనే ఉన్నదన్నారు. జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్​ చేసి ఉంటారన్నారు. హైదరాబాద్​లో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ ఇంట్లో మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడారు.  

‘‘పదేండ్ల కాలంలో అందరి ఫోన్లనూ బీఆర్ఎస్​పాలకులు ట్యాప్​ చేశారు. ఈ విషయాన్ని వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇందులో ఎవరెవరున్నారో అన్నీ కాలక్రమంలో తెలుస్తాయి. ప్రస్తుతం దీనిపై విచారణ నడుస్తున్నది. చట్ట ప్రకారం చర్యలుంటాయి” అని తెలిపారు.

 ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారన్న బీఆర్ఎస్​నేతల కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘బీఆర్ఎస్​నేతలు బీజేపీకి బీటీమ్​గా ఉన్నారు. మరి ఇన్నాళ్లూ కేంద్రానికి వాళ్లు డబ్బులు పంపినట్టేనా?” అని కౌంటర్ ఇచ్చారు. తాము డబ్బులతో ఏనాడూ రాజకీయాలు చేయలేదన్నారు.