అర్జున్ అంబటి హీరోగా నాగ శివ దర్శకత్వంలో గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. తేలప్రోలు ప్రసన్న, పులగం సుప్రియ కో ప్రొడ్యూసర్స్. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈనెల 24న సినిమా రిలీజ్ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, వీర శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అచ్చ తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని, హీరో అర్జున్ అంబటి సహా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని అతిథులంతా విష్ చేశారు. ‘ఓ మంచి ప్రయత్నంగా ఈ సినిమా చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే అందరికీ నచ్చుతుంది’ అని హీరో అర్జున్ అంబటి చెప్పాడు. కొత్త తరహా కథనంతో వస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని హీరోయిన్ జెన్నిఫర్ చెప్పింది. దర్శకుడు నాగశివ, నిర్మాతలు గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు, మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ పాల్గొన్నారు.

